సోమవారం 25 మే 2020
National - Apr 09, 2020 , 16:37:30

కారులోనే డాక్టర్ నివాసం.. నెటిజనుల ప్రశంసలు

కారులోనే డాక్టర్ నివాసం.. నెటిజనుల ప్రశంసలు

హైదరాబాద్: కరోనాపై జరుగుతున్న పోరులో అహోరాత్రులు పాటుపడుతున్నది.. కుటుంబ జీవనాన్ని త్యాగం చేస్తున్నది వైద్యులే అని చెప్పాలి. కరోనా ఎక్కడ వ్యాపిస్తుందోనన్న భయంతో చాలామంది ఇళ్లకు వెళ్లడం లేదు. వెళ్లినా ఇంటిముందు కాసేపు అపరిచిత వ్యక్తిలా కూర్చుని దూరం నుంచే భార్యాపిల్లల్ని పలుకరించి తిరిగి విధుల్లో చేరుతున్నారు. భోపాల్‌లో అయితే ఓ వైద్యుడు ఏకంగా తన కారునే నివాసంగా చేసుకుని గడుపుతున్నారు. ఆస్పత్రి డ్యూటీ మధ్య విరామంలో ఆయన కనీస సౌకర్యాలతో అతడు కారులో గడుపుతున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జేపీ హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్ సచిన్ నాయక్ కారునివాసం దృశ్యాలు నెటిజనుల మన్ననలు అందుకుంటున్నాయి. ఈ కరోనా హీరోను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సైతం ప్రశంసించారు. మీలాంటి యోధులు పోరాటం కొనసాగిస్తే కరోనాపై సాగిస్తున్న మహాయుద్ధంలో మనం విజయం సాధించడం ఖాయమంటూ సీఎం ట్విట్టర్‌లో శాల్యూట్ చేశారు. ఇలా వైద్యులే కాకుండా పోలీసులు సైతం తమ త్యాగనిరతితో సమాజ మన్ననలు అందుకుంటున్నారు.


logo