సోమవారం 13 జూలై 2020
National - Jun 21, 2020 , 15:44:08

తండ్రి కోసం డాక్టరయ్యాడు.. తన కోసం డీఎస్పీ అయ్యాడు..

తండ్రి కోసం డాక్టరయ్యాడు.. తన కోసం డీఎస్పీ అయ్యాడు..

భోపాల్‌: చిన్నతనం నుంచి పోలీసు కావాలని కలలు కన్నాడు. అయితే, తండ్రి కలలను సాకారం చేసేందుకు తన కలల్ని పక్కన పెట్టాడు. చివరకు తండ్రి కలతోపాటు తన కలనూ నెరవేర్చుకొన్నాడు. అంతేకాకుండా తండ్రి కోరికను రెట్టింపు చేసేందుకు తన సోదరిని కూడా డాక్టర్‌ను చేశాడా ఆదర్శమూర్తి. 

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఖార్గవాలి గ్రామంలో రైతు ఇంద్రపాల్ సింగ్‌ జాట్‌ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. తన పిల్లల్ని ఉన్నతంగా చదివించాలని భావించి వ్యవసాయం చేస్తూ పైసా పైసా కూడబెట్టాడు. తండ్రి కోరిక మేరకు 2005 లో మెడిసిన్‌ పరీక్షల కోసం జితేంద్ర భోపాల్‌లో సిద్ధమవుతున్నాడు. కుమారుడిని కలిసేందుకు మరో కుమారుడు దర్మేంద్రసింగ్‌తో కలిసి భోపాల్‌ బయల్దేరిన వారిని.. ప్రమాదం రూపంలో మృత్యువు కబలంచింది. తండ్రి ఆశల్ని, ఆశయాల్ని భుజానకెత్తుకొన్న మరో కుమారుడు మహేంద్ర.. తండ్రి కలను నిజం చేయాలని తమ్ముడిని కోరాడు. 2007లో ప్రీ-మెడికల్ టెస్టులో ఎంపికై వైద్యవిద్యా పూర్తిచేశాడు. అనంతరం ఏడాదిపాటు హామీడియాలోని ప్రభుత్వ దవాఖానలో సేవలందించాడు. 

అనంతరం తన కలల్ని నిజం చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. చేస్తున్న ఉద్యోగానికి ఏడాది పాటు సెలవు తీసుకొని కష్టించి 2014లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తరువాత డాక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన జితేంద్ర.. ప్రస్తుతం బాలాఘాట్‌ జిల్లా ఎస్డీఓపీగా సేవలందిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో రైసన్లో ఉన్న కారణంగా దాదాపు రెండు నెలలపాటు కరోనా వారియ‌ర్‌ ద్విముఖ సేవలందించారు. ఒకవైపు తల్లి ఆలనాపాలనా చూస్తూనే .. సోదరి కిరణ్‌ను కూడా వైద్యురాలిగా తయారుచేశాడు. ప్రస్తుతం ఈమె మెడికల్‌ పీజీ చదువుతోంది. తండ్రి కోరిక నెరవేర్చడంకోసం  తన కలల్ని పక్కనపెట్టిన జితేంద్రను ఆదర్శకుమారుడిగా పలు స్వచ్ఛంద సంస్థలు సత్కరించాయి. 


logo