గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 10:58:14

కరోనా పేషెంట్‌కు లైంగిక వేధింపులు.. డాక్టర్‌ అరెస్టు

కరోనా పేషెంట్‌కు లైంగిక వేధింపులు.. డాక్టర్‌ అరెస్టు

అలీఘర్: దీన్‌దయాల్ ఆసుపత్రిలో చేరిన కరోనా పాజిటివ్‌ మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన వైద్యుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘ఎల్‌-2 కొవి‌డ్‌-19 కేర్‌ సెంటర్‌లో ఓ కరోనా బాధిత మహిళను అడ్మిట్‌ చేశారు. అదే దవాఖానలో సేవలందిస్తున్న ఓ వైద్యుడు అక్కడికి వెళ్లి ఆమెను లైంగికంగా ఇబ్బందులకు గురి చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 376 2 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితున్ని అరెస్టు చేసినట్లు పోలీస్‌ సూపరింటెండెంట్‌ (కైమ్‌) అరవింద్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు. సంఘటనపై దర్యాప్తు కోసం జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు కుమార్ చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo