మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 06:42:11

డాక్ట‌ర్‌కు కరోనా చికిత్స దొర‌క‌లేదు

డాక్ట‌ర్‌కు కరోనా చికిత్స దొర‌క‌లేదు

బెంగ‌ళూరు: కరోనా సోకిన ఎంతో మందికి ప్రాణ‌దానం చేశాడు. చివ‌రికి అదే వ్యాధి‌బా‌రిన పడ్డాడు. కానీ ఆయ‌నను చేర్చు‌కో‌వ‌డా‌నికి దవా‌ఖా‌నలు నిరా‌క‌రిం‌చాయి. స్వ‌యానా డాక్ట‌రైన‌ప్ప‌టికీ వ్యాధిని న‌యం చేసుకోవ‌డానికి మ‌రో డాక్ట‌ర్‌ను చేరుకోవ‌డానికి చేసిన పోరాటంలో చివ‌రికి ప్రాణాలు విడుచాడు. ఈ విషాద ఘటన బెంగ‌ళూ‌రులో గురు‌వారం చోటు‌చే‌సు‌కు‌న్నది. 

డాక్టర్‌ మంజు‌నాథ్‌ (50) రామ‌న‌గర జిల్లా‌లోని కన‌క‌పురా తాలు‌కా‌లోని చిక్క‌ముడ‌వాడి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌–19 విధుల్లో రోగు‌లకు సేవలు అందిం‌చే‌వారు. ఈ క్రమంలో ఆయ‌నకు వైరస్‌ సోకింది. చికిత్స కోసం నగ‌రం‌లోని మూడు ప్రైవేటు దవా‌ఖా‌న‌లకు వెళ్లి‌న‌ప్ప‌టికీ చేర్చుకోలేదు. ఆయన కుటుంబం ఓ దవా‌ఖాన ముందు రోడ్డుపై కూర్చున్నారు. దీంతో బెంగ‌ళూరు మెడిక‌ల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆయ‌న్ను జూన్‌ 25న అడ్మిట్‌ చేసు‌కున్న‌ది. చికిత్స పొందుతూ ఆయన గురువారం చనిపోయారు. మంజునాథ్ మామ కూడా కొన్నిరోజుల క్రితం క‌రోనాతోనే మ‌ర‌ణించారు. 

కాగా, క‌రోనాతో వ‌స్తున్న రోగుల‌ను చేర్చుకోవ‌డానికి బెంగ‌ళూరులోని ప్రైవేట్ ద‌వాఖాన‌లు తిర‌స్క‌రించ‌డం ఇదే మొద‌టిసారికాదు. ఇలాంటి ఘ‌ట‌నలు చాలానే జ‌రుగుతున్నాయి. 


logo