శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 11:26:55

తల్లిదండ్రులకు కరోనా.. నెల రోజులు శిశువు బాగోగులు చూసుకున్న డాక్టర్‌

తల్లిదండ్రులకు కరోనా.. నెల రోజులు శిశువు బాగోగులు చూసుకున్న  డాక్టర్‌

తిరువనంతపురం:   కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నా, ఎంతో మంది ప్రాణాలు హరిస్తున్నా.. వెనకడుగు  వేయకుండా  కొవిడ్‌-19 బారిన పడిన వారికి చికిత్స అందిస్తూ ప్రాణదానం చేస్తున్నారు  వైద్యులు. తమ కుటుంబాలను  సైతం వదిలేసి కర్తవ్య దీక్షతో ముందుకెళ్తున్నారు.   ఓ వైపు తీరిక లేకుండా విధులను నిర్వర్తిస్తూనే..ఓ పసిపాప యోగక్షేమాలు  చూసుకున్న  కేరళలోని ఓ డాక్టర్‌ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.   

ఆరు నెలల శిశువు తల్లిదండ్రులకు కరోనా సోకడంతో వీరిద్దరూ   చికిత్స పొందుతున్నారు.  పేరెంట్స్‌ నుంచి పాపకు వైరస్‌ సోకే ప్రమాదం ఉండటంతో కేరళ వైద్యురాలు శిశువును జాగ్రత్తగా చూసుకున్నది. నెల రోజుల పాటు పసిపాప ఆలనాపాలనా చూసుకున్న డాక్టర్‌ తాజాగా తల్లిదండ్రులకు అప్పగించింది. పాప పేరెంట్స్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత హోం క్వారంటైన్‌లో ఉన్నారు.   క్వారంటైన్‌ పూర్తవడంతో   డాక్టర్‌ మేరీ అనిత బుధవారం బాబు ఎల్విన్‌ను తల్లిదండ్రులకు అప్పగించారు. 

ఎర్నాకులం జిల్లాకు చెందిన ఎల్విన్‌ తల్లిదండ్రులు గురుగ్రామ్‌లోని ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో నర్సులుగా పనిచేస్తున్నారు. గతనెల బాబు తండ్రికి కరోనా పాజిటివ్‌గా  నిర్ధారణ అయింది. ఎల్విన్‌తో కలిసి అతని తల్లి కేరళకు తిరిగొచ్చింది.  కోచికి చేరుకున్న తర్వాత పాప తల్లికి కూడా పాజిటివ్‌గా తేలడంతో హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకున్నది. 


logo