ఆదివారం 07 జూన్ 2020
National - Apr 02, 2020 , 15:30:44

డాక్టర్‌పై ఎమ్మెల్యే దాడి..కొనసాగుతున్న విచారణ

డాక్టర్‌పై ఎమ్మెల్యే దాడి..కొనసాగుతున్న విచారణ

సిల్చార్‌  : విధుల్లో ఉన్న డాక్టర్‌పై ఎమ్మెల్యే చేయి చేసుకున్న ఘటనపై విచారణ కొనసాగుతుంది. అసోలోని సిల్చార్‌ జిల్లా బొర్కాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అప్పడే పుట్టిన చిన్నారికి చికిత్సనందించే విషయంలో..బీజేపీ ఎమ్మెల్యే కిశోర్‌నాథ్‌, ఆయన అనుచరులు డాక్టర్‌తో వాగ్వాదానికి దిగి..దాడి చేశారు. దీంతో సదరు డాక్టర్‌ ఆ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.  ఈ ఘటనపై డాక్టర్‌ ఎం సింగ్‌ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుందని వైద్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మరో వైపు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అసోం శాఖ బీజేపీ ఎమ్మెల్యే కిశోర్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీఎం సర్బానంద్‌ సోనోవాల్‌కు ఫిర్యాదు చేశారు. డాక్టర్‌పై దాడి వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo