గురువారం 26 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 16:47:45

హెల్మెట్ ఎంత ముఖ్య‌మో తెలిపే జీవి ఇదే..!

హెల్మెట్ ఎంత ముఖ్య‌మో తెలిపే జీవి ఇదే..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లో హెల్మెట్ పెట్టుకోవాల‌నే నిబంధ‌న‌ల‌ను పాటించేలా  మార్గ‌ద‌ర్శ‌కాలు అమ‌లులో ఉన్నాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే ఎంత క‌ఠిన‌మైన చ‌ట్టాలున్నా హెల్మెట్ ధ‌రించే విష‌యంలో మాత్రం కొంద‌రు నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంటారు. అలాంటి వారి కోసం పోలీసులు అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ఉంటారు. ఎందుకంటే డ్రైవింగ్ చేసేట‌పుడు హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే ప్రాణాలు పోయే సంద‌ర్భాలు అధికం.

రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ లో భాగంగా పూణే పోలీసులు వినూత్న రీతుల్లో వాహ‌న‌దారులకు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే తాజాగా పూణే పోలీసాఫీస‌ర్ ఒక‌రు టార్టాయిస్ తాబేటు పోస్ట్ తో స‌రికొత్త‌గా రోడ్ సేఫ్టీ పాఠాలు చెప్తున్నారు. ఈ పోస్ట్ ఇపుడు ట్రెండింగ్ లో ఉంది. 

పాఠ్య‌పుస్త‌కాల్లో తాబేలు-కుందేలు ప‌రుగు పందెం క‌థ వినే ఉంటారు. ధృఢ‌మైన క‌వ‌చంతో ఉన్న తాబేలు న‌డ‌క మెల్ల‌గా ఉంటుంద‌ని అంద‌రికీ తెలిసిందే. కుందేలు మాత్రం చెంగు చెంగున ప‌రుగులు పెడుతుంది. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో నేనే గెలుస్తాన‌నుకుని ధీమాగా ఉన్న కుందేలును తాబేలు త‌న‌దైన టైమింగ్ తో చాక‌చ‌క్యంగా ఓడిస్తుంది. తొంద‌ర‌ప‌డ‌కుండా నెమ్మ‌దిగా, సుర‌క్షితంగా వెళ్తే సుదూర ల‌క్ష్యాన్నైనా చేధించ‌వచ్చని తాబేలు పోస్టుతో అంద‌రికీ చెప్పారు పూణే పోలీసులు. 

ఓ తాబేలు ఫొటోను ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసి..  మెల్ల‌గా న‌డిచే జంతువైన తాబేలుకు కూడా హెల్మెట్ ప్రాముఖ్య‌త ఏంటో తెలుసున‌ని క్యాప్ష‌న్ ఇచ్చారు.  నెమ్మ‌దిగా..భ‌ద్రంగా..లాంగ్ రేస్ అయినా గెల‌వండి అంటూ మ‌రో క్యాప్ష‌న్ ఇచ్చారు. స‌రికొత్త‌గా ఆలోచించి పూణే పోలీసులు రోడ్ సేఫ్టీ పై పెట్టిన ఈ పోస్ట్ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.