మెహరీన్ కౌర్ హర్యానాకు చెందిన కాంగ్రెస్ నేత భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంగేజ్ మెంట్ అనంతరం మెహరీన్ కు కోవిడ్ నిర్దారణ అయి.. కొన్ని రోజుల తర్వాత కోలుకుంది. భవ్య బిష్ణోయ్ కుటుంబసభ్యులకు కూడా కోవిడ్ పాజిటివ్ తేలి..ఆ తర్వాత కోలుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత వెడ్డింగ్ ప్లాన్ మొదలుపెట్టాలని మెహరీన్ ఫిక్స్ అయింది. దీంతో ప్రస్తుతం మెహరీన్ చేతుల్లో టైం ఉంది.
పెండ్లి తర్వాత సినిమాల్లో నటించవద్దని భవ్య బిష్ణోయ్ చెప్పడంతో..కొత్త సినిమాల విషయంలో వెనక్కి తగ్గింది మెహరీన్. అయితే ఇపుడు సీన్ రివర్సైంది. ఇపుడు వెడ్డింగ్ వాయిదా పడటంతో మెహరీన్ చేతుల్లో వీలైనంత సమయం ఉంది. ఎంగేజ్ మెంట్ తర్వాత ఆఫర్లకు నో చెప్పిన మెహరీన్..ఇపుడు తెలుగులో ఆఫర్ల కోసం ఎదురుచూస్తుందట. మరి దర్శకనిర్మాతలు కూడా ఆఫర్లు ఇచ్చేందుకు రెడీగా ఉండే ఉంటారని గుసగుసలాడుకుంటున్నారు సినీ జనాలు.