మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 18:33:54

తమిళనాడులో కరోనాతో ఎంతమంది చనిపోయారో తెలుసా?

తమిళనాడులో కరోనాతో ఎంతమంది చనిపోయారో తెలుసా?

చెన్నై : కరోనా దేశంలోని అన్ని రాష్ట్రాలను గడగడలాడిస్తోంది. ఒక రాష్ట్రానికి మించి ఇంకో రాష్ట్రంలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా బారిన పడి వేలల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 64 మంది కరోనాతో మరణించగా.. కొత్తగా 3,756 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1,22,350కు చేరింది. అయితే అందులో 46,480మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 1700మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo