ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 11:52:59

పండ్లు, కూరగాయలను శానిటైజ్ చేయకూడదా..?

పండ్లు, కూరగాయలను శానిటైజ్ చేయకూడదా..?

హైదరాబాద్: కరోనా  నేపథ్యంలో  ఇదొక అవసరానికి తప్పనిసరిగా బజారుకు వెళ్లాల్సి వస్తున్నది. నిత్యావసరాలు, రోజువారీ కాయగూరలు, పండ్ల కోసం ఇంట్లో నుంచి ఎవరో ఒకరు కచ్చితంగా బయటికి వెళ్లాల్సిందే. కోవిడ్ -19 పరిస్థితుల దృష్ట్యా ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే .  ప్యాక్‌ చేసిన వస్తువులు, ఆహార పదార్థాలపైన శానిటైజర్‌ స్ప్రే చేయడం లేదంటే క్లాత్ సహాయంతో వాటిపై అప్లై చేయడం వంటివి చేయచ్చు. మరి, పండ్లు, కాయగూరల సంగతేంటి? అన్నింటిలాగే వాటిపైనా శానిటైజర్‌ స్ప్రే చేస్తే అందులోని ఆల్కహాల్‌ ప్రభావానికి పండ్లు, కాయగూరల్లోని పోషకాలు నశించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఇంట్లో సహజసిద్ధంగా తయారుచేసుకున్న ద్రావణాలతోనే వీటిని కడగాలని సూచిస్తున్నారు.  

ఇలా ప్రమాదకరం...  బయటి నుంచి తెచ్చిన పండ్లు, కాయగూరల్ని కడిగే విషయంలో కొంతమంది అతి శుభ్రత పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే శానిటైజర్లను క్లాత్‌పై వేసి పండ్లు, కాయగూరలను తుడవడం లేదంటే వాటిపై శానిటైజర్‌ని స్ప్రే చేయడం వంటివి చేస్తున్నారు. ఇక మరికొందరేమో డిటర్జెంట్‌ కలిపిన నీటిలో కాయగూరల్ని, పండ్లను వేసి నానబెడుతున్నారు. ఇలాంటి పనులు అస్సలు కూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలోని రసాయనాలు, ఆల్కహాల్‌ పండ్లు, కాయగూరల్లోని పోషకాల్ని నశింపజేయడంతో పాటు.. ఆ రసాయన అవశేషాలు వాటి చర్మంపై జిడ్డులాగా అంటుకుపోతాయి.

ఇక ఎంత కడిగినా అవి వదలవు. తద్వారా వాటిని మనం తినడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలు, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.. అంతేకాదు.. ఒక్కోసారి ఈ సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్యాలుగా కూడా పరిణమించచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఇలాంటి రసాయన సంబంధిత శానిటైజర్లు, డిటర్జెంట్లకు బదులుగా మన ఇంట్లో లభించే పదార్థాలతోనే సహజసిద్ధంగా క్రిమి సంహారక ద్రావణాలను తయారుచేసుకొని ఉపయోగించమని సలహా ఇస్తున్నారు.logo