మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 01:14:10

పక్షపాత రాజకీయాలు వీడండి

పక్షపాత రాజకీయాలు వీడండి

న్యూఢిల్లీ: అల్లర్లతో దేశ రాజధాని అట్టుడకడంపై  కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. పక్షపాత రాజకీయాలు వీడి ఢిల్లీలో శాంతిని పునరుద్ధరించాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా సూచించారు. ‘ప్రధాని, హోంమంత్రి, ఢిల్లీ సీఎంకు మా విన్నపం. మీ రాజకీయ పక్షపాతాన్ని పక్కనబెట్టి, మీ పార్టీల నేతలుగా కాక  సామాజిక నేతలుగా వ్యవహరించండి. ఢిల్లీ హింసపై తక్షణం స్పందించండి’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం స్పందిస్తూ అసమర్థ్ధులకు అధికారం కట్టబెట్టిన ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ‘అసమర్థ నేతలకు అధికారం కట్టబెట్టిన ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు. పౌరసత్వ చట్టానికి సవరణ ఇప్పుడు ఎందుకు? ఇప్పటికీ మించిపోలేదు. సీఏఏ వ్యతిరేక నిరసనకారుల గొంతును ప్రభు త్వం వినాలి. చట్టం చెల్లుబాటుపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చే వరకు సీఏఏను అమలును నిలిపివేయాలి’ అని పేర్కొన్నారు. 


logo