శనివారం 06 జూన్ 2020
National - May 16, 2020 , 20:34:51

పదో తరగతి పెండింగ్‌ పరీక్షలను నిర్వహించం : మధ్యప్రదేశ్‌ సీఎం

పదో తరగతి పెండింగ్‌ పరీక్షలను నిర్వహించం : మధ్యప్రదేశ్‌ సీఎం

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. రాష్ర్టంలో మొదటగా మార్చి 3వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించతలపెట్టారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పది పరీక్షలు వాయిదా పడ్డాయి. అప్పటికే పలు సబ్జెక్టుల పరీక్షలు ముగిశాయి. మిగతా పరీక్షల నిర్వహణకు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందని చౌహాన్‌ తెలిపారు. పదో తరగతిలో పెండింగ్ పరీక్షలను నిర్వహించడం లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే నిర్వహించిన సబ్జెక్ట్‌ పరీక్షలను అనుసరించి మెరిట్‌ లిస్ట్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు. కాగా 12వ తరగతి పెండింగ్‌ పరీక్షలను మాత్రం జూన్‌ 8వ తేదీ నుంచి జూన్‌ 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. 


logo