శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 15:38:35

హింసకు పాల్పడవద్దు : అసదుద్దీన్‌ ఓవైసీ

హింసకు పాల్పడవద్దు : అసదుద్దీన్‌ ఓవైసీ

హైదరాబాద్ : బెంగళూరులో జరుగుతున్న హింసను ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ సోషల్‌మీడియా వేదికగా బుధవారం ఖండించారు. ‘‘బెంగళూరులో హింసకు సంబంధించి అభ్యంతరకరమైన, అప్రియమైన సోషల్ మీడియా పోస్టులు ఖండించదగినవి. హింసకు పాల్పడొద్దని ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శాంతి బలపడుతుందని నేను నమ్ముతున్నాను” అని అసదుద్దీన్‌ ఒవైసీ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి మేనల్లుడు నవీన్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై మంగళవారం రాత్రి బెంగళూరు నగరంలో హింస చెలరేగడంతో ముగ్గురు మరణించగా, పలువురు గాయపడిన ఘటన తెలిసిందే. హింసకు సంబంధించి పోలీసులపై కాల్పులు, రాళ్లు రువ్వడం, దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 110 మందిని అరెస్టు చేశారు. నిందితుడు నవీన్‌ను కూడా అరెస్టు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo