మంగళవారం 02 మార్చి 2021
National - Jan 23, 2021 , 01:13:33

టీకా అంటూ ఫోన్లు వస్తే నమ్మొద్దు

టీకా అంటూ ఫోన్లు వస్తే నమ్మొద్దు

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేస్తామని, అందుకోసం మీ వివరాలు చెప్పాలని ఎవరైనా కాల్‌ చేస్తే స్పందించవద్దని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా 50 ఏండ్లు పైబడినవారిని, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని ఫోన్‌ కాల్స్‌ రావొచ్చని పేర్కొన్నది. వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అధికారులు  ఎవరూ ఫోన్లు చేయరని చెప్పింది. కొవిన్‌ యాప్‌ ద్వారానే టీకా పంపిణీ జరుగుతుందని, 50 ఏండ్లు పైబడినవారి సమాచారాన్ని కేంద్రం ఓటరు జాబితా నుంచి సేకరిస్తుందని స్పష్టం చేసింది. టీకా కొరకు రూ. 500 చెల్లించాలని మధ్యప్రదేశ్‌లో కొందరు మోసగాళ్లు ఫోన్లు చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ హెచ్చరికలు చేసింది. 

VIDEOS

logo