మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 11:25:12

పాఠశాలలు తెరిచే వరకు ఫీజులు అడగొద్దు

పాఠశాలలు తెరిచే వరకు ఫీజులు అడగొద్దు

జైపూర్‌ : పాఠశాలలు తిరిగి తెరిచే వరకు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని ప్రైవేట్‌ పాఠశాలలకు రాజస్థాన్‌ ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 9 నుంచి  ప్రైవేటు పాఠశాలలు మూడు నెలల (జూన్ 30)వరకు ముందస్తు రుసుము వసూలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి గాను లాక్‌డౌన్‌ లో భాగంగా మార్చిలో పాఠశాలలను మూసివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నా తల్లిదండ్రుల నుంచి మాత్రం ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

రాజస్థాన్‌లో ఇప్పటివరకు 19532 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 15640 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 3445మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 447 మంది ఇప్పటివరకు వైరస్‌ బారిన పడి మృత్యువాత పడ్డారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo