శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 18:28:09

దో గజ్‌కీ దూరీ.. మాస్క్‌ హై జరూరీ : ప్రధాని మోదీ

దో గజ్‌కీ దూరీ.. మాస్క్‌ హై జరూరీ : ప్రధాని మోదీ

అయోధ్య : కరోనా సృష్టించిన పరిస్థితుల నేపథ్యంలో రాముడు అనుసరించిన ‘మర్యాద’ అనే పదానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం గుర్తు చేశారు. భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం ప్రస్తుతం ఇవే మర్యాదకర అంశాలని తెలియజేశారు. 

ప్రస్తుత పరిస్థితిని ఆయన గుర్తు చేస్తూ ‘దో గజ్‌కీ దూరీ.. మాస్క్‌ హై జరూరీ’ (రెండు గజాల దూరం.. మాస్కు తప్పనిసరి) ఇవే మనకు అవసరమని, ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించాలని ఆయన ప్రోత్సహించారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి పునాదిరాయి వేసిన తరువాత ప్రసంగించిన ప్రధాని, రాముడి ఆలయం రాబోయే యుగాల్లో మానవులకు స్ఫూర్తినిస్తుందని, మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. 

కరోనా నేపథ్యంలో రాముడు అనుసరించిన `మర్యాద 'మార్గం ఇప్పుడు మనకు మరింత అవసరమని గుర్తు చేశారు. దో గజ్‌కీ దూరీ.. మాస్క్‌ హై జరూరీ నినాదం పౌరులందరినీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచుతుందని, ఇది తన ప్రార్థన అని సూచించారు. రాముడు, సీతాదేవిల ఆశీర్వాదం దేశ పౌరులపై ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo