బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 07, 2020 , 06:29:21

ఎంసీసీ ద్వారానే డీఎన్‌బీ కౌన్సెలింగ్‌

ఎంసీసీ ద్వారానే డీఎన్‌బీ కౌన్సెలింగ్‌

న్యూఢిల్లీ: నాడీ, హృదయ సంబంధిత అత్యాధునిక చికిత్సల కోసం అభ్యసించే డీఎన్‌బీ సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎన్‌బీఈ) కీలక సూచనలు చేసింది. మెరిట్‌ ఆధారంగా జరిగే కౌన్సెలింగ్‌ ద్వారానే డీఎన్‌బీ కోర్సుల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపింది. అడ్మిషన్లు ఇప్పిస్తామని చెప్పే ఏజెంట్లు, దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ), డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ద్వారానే ప్రవేశాల ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేసింది.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.