బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 12:52:17

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా స్టాలిన్ నిరసన

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా స్టాలిన్ నిరసన

చెన్నై: తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చట్టాలుగా మారిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సోమవారం నిరసన తెలిపారు. కాంచీపురంలోని కీజాంబి గ్రామంలో జరిగిన రైతు నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. మన పొరుగు రాష్ట్రమైన కేరళ, పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాలని యోచిస్తోందని తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇదే విధంగా చేయమని తాము కోరుతున్నామని అన్నారు. లేకపోతే ప్రతిపక్ష పార్టీలు దీనిపై కోర్టును ఆశ్రయిస్తాయని స్టాలిన్ చెప్పారు.

మరోవైపు కర్ణాటకలో రైతుల సంఘాలు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్‌డీఐపీ, కర్ణాటక రాజ్య రైతు సంఘం, జేడీ(ఎస్), కర్ణాటక రక్షణ వేదిక, హసీరు సేన వంటి పలు సంఘాలకు చెందిన కార్యకర్తలు బెంగళూరుతోపాటు పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo