సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 12:24:35

అధిక కరెంట్ బిల్లులపై స్టాలిన్ నిరసన

అధిక కరెంట్ బిల్లులపై స్టాలిన్ నిరసన

చెన్నై: తమిళనాడులో అధిక కరెంట్ బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష డీఎంకే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ నల్లదుస్తులు ధరించి తన ఇంటి ముందు నిరసన తెలిపారు. చేతిలో నల్లజెండాతోపాటు అధిక విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా ఫ్లకార్డును ప్రదర్శించారు. రాష్ట్రంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం కరోనా వేళ ప్రజల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నదని ఇటీవల ఆయన మండిపడ్డారు. ఇంట్లో ఉన్నవారిపై అధిక కరెంట్ బిల్లులు విధించడం, బయటకు వచ్చిన వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నదని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనకు స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఇంటి ముందు నల్ల జెండాలను ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపాలని కోరారు. ఇందులో భాగంగా మంగళవారం స్టాలిన్ నల్ల దుస్తులు ధరించడంతోపాటు నల్లజెండాను చేతపట్టి తన ఇంటి ముందు నిరసన తెలిపారు. ప్రజలకు విధించిన అధిక కరెంట్ బిల్లులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
logo