ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 14, 2020 , 08:53:30

నీట్ వ‌ద్దంటూ మాస్క్‌ల‌పై నినాదం.. ఎంపీల నిర‌స‌న

 నీట్ వ‌ద్దంటూ మాస్క్‌ల‌పై నినాదం.. ఎంపీల నిర‌స‌న

హైద‌రాబాద్‌: త‌మిళ‌నాడుకు చెందిన  డీఎంకే ఎంపీలు ఇవాళ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో నిర‌స‌న చేప‌ట్టారు. వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ఇవాళ ప్రారంభం అవుతున్నాయి. నీట్ ప‌రీక్ష‌కు వ్య‌తిరేకంగా వాళ్లు ధ‌ర్నా చేప‌ట్టారు.  కోవిడ్ నేప‌థ్యంలో అన్ని ఆంక్ష‌ల మ‌ధ్య 18 రోజుల పాటు ఉభ‌యస‌భ‌లు స‌మావేశం కానున్నాయి. అయితే నీట్ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ డీఎంకే ఎంపీలు మాస్క్‌లు  ధ‌రించారు.  నీట్ చేప‌ట్ట‌రాదు అంటూ తాము ధ‌రించిన మాస్క్‌ల‌పై నినాదాలు రాశారు. టీఆర్ బాలు, క‌నిమొళిలు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో నీట్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాలంటూ ఉన్న మాస్క్‌ల‌ను ధ‌రించి త‌మ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.  అన్ని నిబంధ‌న‌లు పాటిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం చెబుతున్నా.. విద్యార్థుల‌కు వైర‌స్ సోకంద‌న్న గ్యారెంటీ ఏముంద‌ని డీఎంకే .. నీట్ ప‌రీక్ష‌ల‌ను వ్య‌తిరేకిస్తున్న‌ది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో నీట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు నిన్న ఆ పార్టీ నేత స్టాలిన్ తెలిపారు. 


logo