గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 11:49:52

తమిళనాడులో తగ్గని వైరస్‌ ఉద్ధృతి...మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

 తమిళనాడులో తగ్గని వైరస్‌ ఉద్ధృతి...మరో  ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే  దాదాపు 7వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బారినపడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతున్నది.  నాగర్‌కోయిల్‌ డీఎంకే  ఎమ్మెల్యే ఎన్‌ సురేశ్‌ రాజన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన   నాగర్‌కోయిల్‌ ప్రభుత్వ  మెడికల్‌ కాలేజ్‌లో చికిత్స పొందుతున్నారు.

జిల్లాలో కిలియూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎస్‌ రాజేశ్‌ కుమార్‌   తర్వాత కరోనా సోకిన రెండో ఎమ్మెల్యే రాజనే. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు  వైరస్‌ సోకింది.  తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,20,716కు చేరింది. కరోనా బారినపడి 3,571 మంది చనిపోయారు. 


logo