ఆదివారం 05 జూలై 2020
National - Jun 27, 2020 , 11:43:24

మరో డీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

మరో డీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభిస్తుండటం  ఆందోళన కలిగిస్తున్నది. ఆ రాష్ట్రంలో మహమ్మారి బారినపడుతున్న   ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా  చెంగల్పేట్ జిల్లా చెయ్యూర్‌ నియోజకవర్గ  డీఎంకే ఎమ్మెల్యే ఆర్‌ టీ అరసు కరోనా బారినపడ్డారు. కరోనా పరీక్ష కోసం శాంపిల్స్‌ ఇచ్చిన అరసు..కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శనివారం ఉదయం తేలింది. చికిత్స కోసం చెన్నైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. 

అరసు కుటుంబ సభ్యులు కూడా కరోనా టెస్టు కోసం శాంపిల్స్‌ ఇచ్చారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.  డీఎంకేలో  కరోనా బారినపడిన మూడో ఎమ్మెల్యే అరసే. ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల  డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ మృతిచెందిన విషయం తెలిసిందే. మరో ఎమ్మెల్యే కే.కార్తికేయన్‌కు కూడా కరోనా సోకింది.   తమిళనాడులో శుక్రవారం ఒక్కరోజే 3,645 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


logo