శుక్రవారం 03 జూలై 2020
National - Jun 23, 2020 , 15:06:49

డీఎంకే నేత‌కు క‌రోనా.. 150 మందిలో గుబులు

డీఎంకే నేత‌కు క‌రోనా.. 150 మందిలో గుబులు

చెన్నై : డీఎంకే నాయ‌కుడితో పాటు ఆయ‌న స‌న్నిహితులైన మ‌రో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ ఫ‌లితం కంటే ముందే.. డీఎంకే నాయ‌కుడు త‌న బ‌ర్త్ డే వేడుక‌ను గ్రాండ్ గా చేశారు. ఆ వేడుక‌కు సుమారు 150 మంది అతిథులు హాజ‌ర‌య్యారు. ఇప్పుడు ఆ 150 మందిలో ఎంత మందికి క‌రోనా సోకిందో తేలాల్సి ఉంది. వీరంతా క‌రోనా త‌మ‌కు సోకిందేమోన‌ని గుబులు చెందుతున్నారు.

డీఎంకే నాయ‌కుడు గుణ‌శేఖ‌ర‌న్(48).. జూన్ 14న క‌న్నంబ‌క్కంలోని మామిడితోట‌లో పుట్టిన రోజు వేడుక‌ను ఘ‌నంగా జ‌రిపారు. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించారు. ఈ వేడుక‌కు 250 మంది హాజ‌రయ్యారు. ఏ ఒక్క‌రూ కూడా మాస్కు ధ‌రించ‌లేదు. భౌతిక దూరం అస‌లే పాటించ‌లేదు.  అయితే వేడుక‌కు వ‌చ్చిన వారంతా.. బ‌ర్త్ డే నాయ‌కుడితో సెల్పీలు దిగారు.  భౌతిక దూరం పాటించ‌కుండా విందులో పాల్గొన్నారు. 

బ‌ర్త్ డే ముగిసిన త‌ర్వాత‌.. గుణ‌శేఖ‌ర‌న్ తో పాటు మ‌రో న‌లుగురిలో క‌రోనా ల‌క్ష‌ణాలు అగుపించాయి. దీంతో కొవిడ్ ప‌రీక్ష‌ల కోసం తిరువ‌ల్లూరులోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి వెళ్లారు.  వీరిలో డీఎంకే నాయ‌కుడితో పాటు మ‌రో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. 

దీంతో బ‌ర్త్ డే పార్టీకి హాజ‌రైన వారిని గుర్తించే ప‌నిలో పోలీసులు నిమ‌గ్న‌మ‌య్యారు. అక్క‌డ చిత్రీక‌రించిన వీడియో ఆధారంగా 60 మందిని పోలీసులు గుర్తించి.. వారి వాహ‌నాల‌ను సీజ్ చేశారు. మిగ‌తా వారిని గుర్తించే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన డీఎంకే లీడ‌ర్ పై కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. 


logo