శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 07:11:12

డీఎంకే సీనియర్‌ నేత అన్బజగన్‌ కన్నుమూత

డీఎంకే సీనియర్‌ నేత అన్బజగన్‌ కన్నుమూత

చెన్నై : డీఎంకే సీనియర్‌ నేత, ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ కె.అన్బజగన్‌(97) కన్నుమూశారు. వయస్సురీత్యా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 24వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని చెన్నైలోని కిజ్పాక్కంలో గల నివాసానికి తరలించారు. అన్బజగన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. ద్రవిడ ఉద్యమంలో బలమైన నాయకుల్లో ఒకరిగా పేరుగాంచిన అన్బజగన్‌ తన సూదీర్ఘ రాజకీయ జీవితంలో 9 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. అన్బజగన్‌ మృతి పట్ల డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌ తీవ్ర సంతాపం ప్రకటించారు. వారం రోజులను సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ వారం రోజులు పార్టీ జెండా సగం వరకే అవనతం చేయనున్నారు.logo