సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 14:05:40

డీఎంకే నుంచి ఎమ్మెల్యే కు.కా.సెల్వం బ‌హిష్క‌ర‌ణ‌

డీఎంకే నుంచి ఎమ్మెల్యే కు.కా.సెల్వం బ‌హిష్క‌ర‌ణ‌

చెన్నై : థౌజండ్స్ లైట్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కు.కా.సెల్వంను డీఎంకే పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ న‌డ్డాను ఢిల్లీలో సెల్వం ఇటీవ‌ల క‌లిశారు. ఈ నేప‌థ్యంలో చ‌ర్య‌లు చేప‌డుతూ మొద‌ట పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ షోకాజు నోటీసు జారీచేసింది. పార్టీ అధ్య‌క్షుడు ఎం.కె.స్టాలిన్ ఓ ప్ర‌క‌ట‌న ద్వారా స్పందిస్తూ... షోకాజు నోటీసుల‌కు సెల్వం నుంచి స‌రైన స‌మాధానం రాలేద‌న్నారు. స‌మాధానం సంతృప్తిక‌రంగా లేనందున క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు చేప‌డుతూ పార్టీ నుంచి బహిష్క‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే హై లెవ‌ల్ ఎగ్జిక్యూటివ్ క‌మిటి నుంచి అదేవిధంగా పార్టీ హెడ్‌క్వార్ట‌ర్స్ ఆఫీస్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి నుంచి సెల్వంను తొల‌గించిన సంగ‌తి తెలిసిందే.


logo