శుక్రవారం 10 జూలై 2020
National - Jun 15, 2020 , 21:33:48

కరోనా మరణాలపై ప్రభుత్వం తప్పుడు నివేదికలిస్తోంది : స్టాలిన్‌

కరోనా మరణాలపై ప్రభుత్వం తప్పుడు నివేదికలిస్తోంది : స్టాలిన్‌

చెన్నై : తమిళనాడులో కరోనా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇస్తున్నది డీఎంకే అధినేత స్టాలిన్‌ సోమవారం ఆక్షేపించారు. ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పాల్పడితే పారదర్శకత లోపించి అధికారులు మరింత లోపాయికారంగా మారే అవకాశముందని అన్నారు. జూన్‌9 గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో 460మంది కరోనాతో మృతి చెందితే అదేరోజు రాష్ట్ర ఆరోగ్యశాఖ తన నివేదికలో 224 మరణాలు సంభవించాయంటూ నివేదిక విడుదల చేయడం హేయనీయమని పేర్కొన్నారు. హెల్త్‌ సెక్రటరీ తీరును ఖండిస్తూ విధానపరమైన లోపంపై దావా వేస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పదిశాతానికి పైగా పెరిగిందని, చాలా మందిని ఇంతవరకు పరీక్షించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ నగరంలో లేనివిధంగా చెన్నైలో కరోనా పెరుగుదల రేటు అధికంగా ఉందని ఆరోపించారు. కరోనా మరణాలను నిర్ధారించేందుకు ఏప్రిల్‌ 20నే రాష్ట్ర ప్రభుత్వం డెత్‌ ఆడిట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. అది ఇప్పటి వరకు పని చేయడమే లేదని ఆరోపించారు.


logo