బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 22, 2020 , 21:46:00

కరోనా టీకా ఏమైనా ఉచిత పథకమా?: స్టాలిన్‌

కరోనా టీకా ఏమైనా ఉచిత పథకమా?: స్టాలిన్‌

చెన్నై: కరోనా టీకా అందుబాటులోకి రాగానే తమినాడు ప్రజలకు ఉచితంగా వేస్తామన్న సీఎం పళనిస్వామి వ్యాఖ్యలపై ప్రతిపక్ష డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్‌ ఏమైనా ఉచిత పథకమా అని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు టీకా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. తాను అద్భుతంగా పాలిస్తున్నట్లు చెప్పుకుంటున్న సీఎం పళనిస్వామిని ప్రజలు భరించలేకపోతున్నారని స్టాలిన్‌ విమర్శించారు. యువ శక్తి సత్తా చాటే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. కళింగర్‌ (కరుణానిధి) ప్రభుత్వం త్వరలో ఏర్పాడుతుందని స్టాలిన్‌ ధీమా వ్యక్తం చేశారు. 

మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో ఆరు నుంచి 12వ తరగతి వరకు చదివి నీట్‌ పాసైన విద్యార్థులకు వైద్య కోర్సుల్లో ప్రవేశానికి 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ రాసిన లేఖ తనకు అందినట్లు తమిళనాడు గవర్నర్‌ తిరు బన్వారిలాల్ పురోహిత్‌ గురువారం తెలిపారు. దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు 3 నుంచి 4 వారాల సమయం పడుతుందని చెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.