బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 14:09:45

కరుణానిధి రెండో వర్థంతి సందర్భంగా డీఎంకే నేతల నివాళి

కరుణానిధి రెండో వర్థంతి సందర్భంగా డీఎంకే నేతల నివాళి

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి రెండో వర్థంతి సందర్భంగా శుక్రవారం డీఎంకే నేతలు ఘనంగా నివాళి అర్పించారు. కరుణానిధి కుమారుడు, డీఎంకే అధినేత స్టాలిన్‌, కుమార్తె కనిమోళితోపాటు పార్టీ నేతలు చెన్నైలోని కరుణానిధి స్మారక సమాధి వద్ద నివాళి అర్పించారు. పార్టీకి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తామని డీఎంకే నేతలు పేర్కొన్నారు. కరుణానిధి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2018 ఆగస్టు 7న 94 ఏండ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.


తాజావార్తలు


logo