శనివారం 11 జూలై 2020
National - Jun 17, 2020 , 12:29:21

అమర్త్య హెగ్డేతో డీకే శివకుమార్‌ కుమార్తె నిశ్చితార్థం

అమర్త్య హెగ్డేతో డీకే శివకుమార్‌ కుమార్తె నిశ్చితార్థం

బెంగళూరు : కర్ణాటక పీసీసీ చీఫ్‌, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం కాఫీ డే ఫౌండర్‌ వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేతో జరిగింది. జూన్‌ 15న బెంగళూరులోని సదాశివనగర్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు అమర్త్య తాత, మాజీ పొలిటీషియన్‌ ఎస్‌ఎమ్‌ కృష్ణ, డీకే శివకుమార్‌ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 

వాస్తవానికి వీరి వివాహం గతేడాదే జరగాల్సి ఉండే. కానీ వీజీ సిద్ధార్థ ఆత్మహత్యతో పెళ్లి వాయిదా పడింది. 2019, జులై 31న సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడే సిద్ధార్థ. ఆర్థిక సమస్యలతో సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. 

అయితే శివకుమార్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య.. ఇంజినీరింగ్‌ విద్యను అమెరికాలో పూర్తి చేశారు. ప్రస్తుతం తన వ్యాపార కార్యకలాపాలతో ఆమె బిజీగా ఉన్నారు. అమర్త్య కూడా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాడు. ప్రస్తుతం తండ్రి వ్యాపార బాధ్యతలను అమర్త్య చూసుకుంటున్నారు. 


logo