ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 11:33:29

ఎమ్మెల్యే ఇంటిపై దాడిని ఖండించిన డీకే శివకుమార్‌

ఎమ్మెల్యే ఇంటిపై దాడిని ఖండించిన డీకే శివకుమార్‌

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై ఆందోళనకారులు దాడి చేయడాన్ని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ డీకే శివకుమార్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను పార్టీ కూడా ఖండిస్తుందని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వివాదం చోటు చేసుకుందని చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని డీకే శివకుమార్‌ కోరారు. ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశం నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్యతో మాట్లాడానని, ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని శివకుమార్‌ స్పష్టం చేశారు. 


logo