మంగళవారం 31 మార్చి 2020
National - Mar 11, 2020 , 17:24:48

కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌

కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రకటించింది. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియాకమైన శివకుమార్‌కు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్‌ మాట్లాడుతూ.. తాను ఒంటరి కాదు.. మనమంతా ఒక టీమ్‌ అని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి.. కలిసికట్టుగా పని చేసుకోవాలని శివకుమార్‌ పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌గా అనిల్‌ చౌదరి పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. 


logo
>>>>>>