e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home జాతీయం కార్యకర్త చెంప పగులగొట్టిన కాంగ్రెస్‌ నేత శివకుమార్‌ - వీడియో

కార్యకర్త చెంప పగులగొట్టిన కాంగ్రెస్‌ నేత శివకుమార్‌ – వీడియో

కార్యకర్త చెంప పగులగొట్టిన కాంగ్రెస్‌ నేత శివకుమార్‌ - వీడియో

బెంగళూరు, జూలై 10: కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పట్టరాని కోపంతో అందరిముందు పార్టీ కార్యకర్త చెంప పగులగొట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి జీ మాదెగౌడను పరామర్శించేందుకు శివకుమార్‌ శుక్రవారం మాండ్యకు వచ్చారు. నడిచివెళుతుండగా శివకుమార్‌ భుజంపై ఓ కార్యకర్త చెయ్యి వేయడానికి ప్రయత్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్‌ వెనక్కితిరిగి ఆ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఈ సన్నివేశాన్ని అక్కడున్న మీడియా వీడియో తీసిందని గ్రహించిన శివకుమార్‌… ఆ వీడియోను డిలీట్‌ చేయాలని విలేకరులను కోరారు. ఆ కార్యకర్త భౌతికదూరం పాటించకపోవడంతో తనకు కోపం వచ్చిందంటూ సమర్థించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. బీజేపీ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసి, శివకుమార్‌ను ‘రౌడీ’ అని విమర్శించింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కార్యకర్త చెంప పగులగొట్టిన కాంగ్రెస్‌ నేత శివకుమార్‌ - వీడియో
కార్యకర్త చెంప పగులగొట్టిన కాంగ్రెస్‌ నేత శివకుమార్‌ - వీడియో
కార్యకర్త చెంప పగులగొట్టిన కాంగ్రెస్‌ నేత శివకుమార్‌ - వీడియో

ట్రెండింగ్‌

Advertisement