బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 26, 2020 , 16:16:54

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గంలోకి డీకే అరుణ‌, ల‌క్ష్మ‌ణ్‌

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గంలోకి డీకే అరుణ‌, ల‌క్ష్మ‌ణ్‌

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గాన్ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జ‌యప్ర‌కాశ్ న‌డ్డా ప్ర‌క‌టించారు. తెలంగాణ నుంచి డీకే అరుణ, డాక్ట‌ర్ కే ల‌క్ష్మ‌ణ్‌కు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి పురంధేశ్వ‌రి, స‌త్య‌కుమార్‌కు జాతీయ క‌మిటీలో చోటు ద‌క్కింది. బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలిగా డీకే అరుణ‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షుడిగా డాక్ట‌ర్ కే ల‌క్ష్మ‌ణ్ ఎంపిక కాగా‌, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పురంధేశ్వ‌రి, జాతీయ కార్య‌ద‌ర్శిగా స‌త్య‌కుమార్‌కు స్థానం ల‌భించింది. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల జాబితాలో రామ్‌మాధ‌వ్‌, ముర‌ళీధ‌ర్ రావుకు చోటు ద‌క్క‌లేదు. జాతీయ అధికార ప్ర‌తినిధుల జాబితాలో జీవీఎల్ న‌ర్సింహారావుకు స్థానం ల‌భించ‌లేదు. 


logo