గురువారం 16 జూలై 2020
National - Jun 20, 2020 , 18:12:45

లాయ‌ర్ కు క‌రోనా పాజిటివ్.. జిల్లా కోర్టు మూసివేత‌

లాయ‌ర్ కు క‌రోనా పాజిటివ్.. జిల్లా కోర్టు మూసివేత‌

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ఓ న్యాయ‌వాదికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో.. శ‌నివారం రోజు షాజ‌హాన్ పూర్ జిల్లా కోర్టును మూసివేశారు. 24 గంట‌ల పాటు కోర్టు ప్రాంగ‌ణం మూసివేస్తున్న‌ట్లు సెంట్ర‌ల్ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు జ‌స్వింద‌ర్ సింగ్ బ‌జాజ్, జిల్లా న్యాయ‌మూర్తి రాంబాబు శ‌ర్మ తెలిపారు. కోర్టు లోప‌లి భాగంతో పాటు, ప‌రిస‌రాల‌ను శానిటైజ్ చేసిన త‌ర్వాతే తెరుస్తామ‌న్నారు. 

షాజ‌హాన్ పూర్ జిల్లాలో మొత్తం 91 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వీరిలో 49 మంది చికిత్స పొందుతుండ‌గా, మ‌రో 42 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన‌ట్లు చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఎస్పీ గౌత‌మ్ తెలిపారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మొత్తం 16,594 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 507 మంది చ‌నిపోయారు. మ‌హారాష్ర్ట మొద‌టి స్థానంలో ఉండ‌గా, త‌మిళ‌నాడు, ఢిల్లీ, గుజ‌రాత్, యూపీ.. రెండు, మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి.


logo