శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 17:36:17

విద్యార్థుల తల్లిదండ్రులకు బియ్యం, నగదు పంపిణీ

విద్యార్థుల తల్లిదండ్రులకు బియ్యం, నగదు పంపిణీ

పుదుచ్చేరి : కరోనా వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు  మధ్యాహ్న భోజనం అందడం లేదు. దీంతో  విద్యార్థుల తల్లిదండ్రులకు బియ్యం, డబ్బు అందించాలని పుదుచ్చేరి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఆర్.కమలకన్నన్ తెలిపారు. ‘కరోనా కారణంగా పాఠశాలలు మూతబడ్డాయి. ఈ క్రమంలో 50,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక్కో విద్యార్థికి 4 కిలోల బియ్యం, 250 రూపాయల చొప్పున నాలుగు నెలలకు సబంధించిన మొత్తం ఇవ్వనున్నాం’ అని కమలకన్నన్ తెలిపారు.

కాగా పుదుచ్చేరిలో శనివారం 58 కొత్త కరోనా కేసులు నమోదవగా.. ముగ్గురు మరణించారు.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,898కు చేరింది.  ఇప్పటి వరకు మొత్తం 804 మంది కరోనా నుంచి కోలుకోగా.. 28 మంది మృతువాత పడ్డారు.  సుమారు 1,066 మంది చికిత్స పొందుతున్నారని పుదుచ్చేరి ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo