e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News బీజేపీలో నిరాశ‌కు గుర‌య్యా.. బాబుల్ సుప్రియో సంచ‌ల‌నం

బీజేపీలో నిరాశ‌కు గుర‌య్యా.. బాబుల్ సుప్రియో సంచ‌ల‌నం

న్యూఢిల్లీ: బీజేపీ త‌న‌ను నిరాశ‌కు గురి చేసింద‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో అన్నారు. తాను బెంచ్‌కు ప‌రిమితం కావ‌డానికి సిద్ధంగా లేన‌ని చెప్పారు. ఇటీవ‌ల కేంద్ర క్యాబినెట్ నుంచి త‌ప్పించిన వెంట‌నే రాజ‌కీయాల నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ శ‌నివారం తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నేను నిరాశ‌కు గుర‌య్యాను. ఏడేండ్లుగా పార్టీ కోసం ప‌ని చేశాను. బెంగాల్‌లో నేను పోరాడ‌లేద‌ని నా వ్య‌తిరేకులు కూడా అన‌లేరు అని ఓ టీవీ చానెల్‌తో అన్నారు. ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలో చేర‌డం మంచిద‌ని నేను భావించా. త‌న టీంలో ఉండాల‌ని భావించిన కోచ్‌.. సాద‌రంగా న‌న్ను ఆహ్వానించారు అని వ్యాఖ్యానించారు. త‌న‌కు ఏ ఇత‌ర పార్టీల నుంచి ఆఫ‌ర్లు రాలేద‌న్నారు. గ‌త మూడు రోజుల్లోనే అంతా జ‌రిగింద‌ని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement