గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 10:36:28

గుంటూరులో దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం

గుంటూరులో దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం

అమరావతి : ఏపీలోని గుంటూరు పట్టణంలో దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభమైంది. ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మహిళల భద్రతకు పోలీస్‌శాఖ పెద్దపీట వేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 13 దిశ పోలీస్‌ స్టేషన్‌లు ప్రారంభించినట్లు తెలిపారు. దిశ పోలీస్‌ స్టేషన్‌లలో 50 శాతం మహిళా ఉద్యోగులను నియమించనున్నట్లు తెలిపారు. 


logo