ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 10:19:29

ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ జ‌ర‌గ‌లేదు.. చైనాకు చెప్పిన ఇండియా

ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ జ‌ర‌గ‌లేదు.. చైనాకు చెప్పిన ఇండియా

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్ నుంచి చైనా ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ పూర్తిగా జ‌ర‌గ‌లేద‌ని ఇండియా పేర్కొన్న‌ది.  అన్ని వివాదాస్ప‌ద ప్రాంతాల నుంచి త‌మ ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించిన‌ట్లు రెండు రోజుల క్రిత‌మే చైనా ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో భార‌త్ ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌ట‌న చేస్తూ.. చైనా ద‌ళాలు సంపూర్ణంగా వెన‌క్కి వెళ్ల‌లేద‌న్న‌ది. ల‌డఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అయితే రెండు దేశాల మ‌ధ్య మ‌రో ద‌ఫా లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ లెవ‌ల్ స్థాయి చ‌ర్చ‌లు మ‌రో రెండు రోజుల్లో జ‌రగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త్ త‌న నిర్ణ‌యాన్ని చైనాకు స్ప‌ష్టం చేసింది.  ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ‌లో ప్ర‌గ‌తి ఉన్నా.. పూర్తి కాలేద‌ని విదేశాంగ‌శాఖ ప్ర‌తినిధి అనురాగ్ శ్రీవాత్స‌వ్ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల ఆధారంగానే స‌రిహ‌ద్దుల్లో శాంతి, సామ‌ర‌స్యం వెల‌సిల్లుతుంద‌ని శ్రీవాత్స‌వ్ అన్నారు.  పూర్తి స్థాయిలో ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ‌కు చైనా స‌హ‌క‌రిస్తుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.logo