శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 01:46:46

భారతీయుడు-2 సెట్స్‌లో భారీ ప్రమాదం

భారతీయుడు-2 సెట్స్‌లో భారీ ప్రమాదం
  • క్రేన్‌ విరిగిపడి ముగ్గురు దుర్మరణం
  • దర్శకుడు శంకర్‌తోపాటు మరో పదిమందికి గాయాలు

చెన్నై, ఫిబ్రవరి 19: శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు-2’ సినిమా చిత్రీకరణ సందర్భంగా  బుధవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శంకర్‌కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తున్నది. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌ సిటీలో సెట్స్‌ వేస్తుండగా ఒక క్రేన్‌ విరిగిపడడంతో ఈ దుర్ఘటన సంభవించింది. శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ, ఆహార సరఫరాదారు చంద్రన్‌ మృతిచెందినట్లు సమాచారం. 


దర్శకుడు శంకర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయని, ఆయన కాలు విరిగినట్లు సమాచారం. మరో పది మంది వరకు గాయపడినట్లు తెలిసింది. క్షతగాత్రులను వెంటనే దవాఖానకు తరలించారు. ఘటనా స్థలంలోనే ఉన్న కమల్‌హాసన్‌.. గాయపడిన వారిని దవాఖానకు తరలించడంలో సాయపడ్డారు. సెట్స్‌లో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తున్నది. ప్రమాద ఘటన తెలియగానే చిత్ర నిర్మాతలు, బృందం వెంటనే దవాఖానకు చేరుకున్నారు. ఈ ఘటనపై తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. 


logo