గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 31, 2020 , 15:13:57

గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసేలా అయోధ్యలో దీపోత్సవ్‌

గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసేలా అయోధ్యలో దీపోత్సవ్‌

అయోధ్య : గతేడాది 4.10లక్షల ప్రమిదలతో దీపాలు వెలిగించి గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించగా.. ఈ సారి ఆ రికార్డ్‌ను బ్రేక్‌ చేస్తూ ఆరు లక్షల దీపాలతో దీపోత్సవం నిర్వహించనున్నట్లు అయోధ్య అధికారులు తెలిపారు. దీపావళి సందర్భంగా అయోధ్య గత నాలుగు సంవత్సరాలుగా వేడుకలు నిర్వహిస్తున్నారు. సరయు నది ఒడ్డున గతేడాది 4.10లక్షల దీపాలు వెలిగించగా.. గిన్నిస్‌ బుక్‌ఆఫ్‌ రికార్డులోకి ఎక్కింది. వచ్చే నెల 14న దీపావళి పండుగ సందర్భంగా 13న 6లక్షల దీపాలు వెలిగించాలని నిర్ణయించినట్లు కార్యక్రమం నోడల్ అధికారి శైలేంద్ర వర్మ తెలిపారు. ఇందుకు 8వేల మంది విశ్వవిద్యాలయ, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.