ఆదివారం 05 జూలై 2020
National - Jun 21, 2020 , 20:27:05

తగ్గిన టుండే కబాబ్‌ అమ్మకాలు

తగ్గిన టుండే కబాబ్‌ అమ్మకాలు

లక్నో : కరోనా సంక్షోభం అన్నిరంగాలనూ కుదిపేస్తోంది. రోడ్డు వెంట పానీపూరి, టిఫిన్‌, కబాబ్‌ సెంటర్లు నిర్వహించే చిన్నాచితకా వ్యాపారులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్‌ ముగిసినా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. వైరస్‌ వ్యాప్తి తగ్గకపోవడంతో జనాలు తినేందుకు జంకుతుండడంతో వ్యాపారం 60శాతానికిపైగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్నోలో సుప్రసిద్ధ వంటకమైన టుండే కాబాబ్‌కు సైతం ప్రస్తుతం ఆదరణ కరువైంది. గలవత్‌ కబాబ్స్‌ తయారీకి దున్న మాంసాన్ని వినియోగిస్తామని, కాని లాక్‌డౌన్‌ నాటి నుంచి దున్న మాసం లభించకపోవడంతో కోడిమాంసాన్ని వినియోగించి మజ్‌బూరీ కబాబ్‌గా పేరు మార్చాల్సి వచ్చిందని కబాబ్‌ షాపు నిర్వాహకుడు మహ్మద్‌ ఉస్మాన్‌ ఆవేదన వ్యకం చేశాడు. అడిగిన వారికి మాంసం కబాబ్‌లు అందించినా అమ్మకాలు 60శాతానికి   మించడం లేదని చెప్పాడు. 


logo