బుధవారం 03 జూన్ 2020
National - Feb 05, 2020 , 02:06:17

బెంగాల్‌లో శిఖండి పాలన: బీజేపీ

బెంగాల్‌లో శిఖండి పాలన: బీజేపీ

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ ‘శిఖండి’లా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ బెంగాల్‌ శాఖ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ బెంగాల్‌కు ప్రధాని మోదీ వచ్చినప్పుడు ‘గో బ్యాక్‌' బ్యానర్లు వెలుస్తాయని, కానీ పొరుగు దేశాల నుంచి రోహింగ్యా ముస్లింలు వచ్చినప్పుడు స్వాగతం పలుకుతారని, వారిని ఓటు బ్యాంకుగా పరిగణించడమేనని దీనికి కారణమన్నారు. ‘దురదృష్టవశాత్తు అక్కడ (బెంగాల్‌)లో ‘శిఖండి’లు అధికారంలో ఉండటంతో పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్న నన్ను అప్రతిష్ఠ పాల్జేశారు’ అని ఆరోపించారు. 


logo