మంగళవారం 11 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 22:30:04

రాహుల్ గాంధీ మరింత యాక్టీవ్ కావాల్సిందే

రాహుల్ గాంధీ మరింత యాక్టీవ్ కావాల్సిందే

న్యూఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్ష పీఠాన్ని రాహుల్ గాంధీ అధిష్టించాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వస్తున్నది. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబంపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు తీవ్రమయ్యాయి. రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా చేయాల్సిందేనంటూ పలువురు నాయకులు తమ స్వంత కోరికల జాబితాతో ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన పలు సూచనలు రాహుల్ గాంధీకి కోపం, చికాకు తెప్పించాయి.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవి చేపట్టడానికి ముందు ఆయన పార్లమెంట్లో మరింత యాక్టీవ్ గా ఉండాలని, అలాగే ప్రజల మధ్య ఎక్కువ సమయం గడిపేలా చూసుకోవాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు.రాహుల్ గాంధీకి మాస్ కనెక్షన్ లేకపోవడంపై విమర్శలను నిశ్శబ్దంగా నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ కు శరద్ పవార్ ఇచ్చిన సలహాను కూడా డిగ్గీరాజా ట్విట్టర్లో నొక్కిచెప్పారు.

"నేను అంగీకరిస్తున్నాను. అతను భిన్నంగా ఉంటాడు. భిన్నంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు. మనం అతడ్ని అలా అనుమతించాలి. కాని అతను పార్లమెంటులో మరింత చురుకుగా ఉండాలని, ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. శరద్ పవార్ సలహా ప్రకారం రాహుల్ భారతదేశం చుట్టూ తిరగాలి. ప్రజలతో కనెక్ట్ అవడానికి యాత్రలు ముఖ్యమైనవి" అని దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.


logo