బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 12, 2020 , 10:33:23

తేజ‌స్విని ఆశీర్వ‌దించండి : దిగ్విజ‌య్ సింగ్

తేజ‌స్విని ఆశీర్వ‌దించండి : దిగ్విజ‌య్ సింగ్

న్యూఢిల్లీ : ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్‌ను ఆశీర్వ‌దించాల‌ని సీఎం నితీష్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ కోరారు. ఎన్డీఏ కూట‌మి నుంచి వైదొల‌గి, తేజ‌స్వికి మ‌ద్ద‌తు ఇచ్చి ఆయ‌న‌ను సీఎం చేయండి అని నితీశ్‌కు దిగ్విజ‌య్ విజ్ఞ‌ప్తి చేశారు. బీహార్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ కుటిల రాజ‌కీయాల‌కు తెర తీస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అవ‌స‌రం కోస‌మే నితీష్‌ను ఆ పార్టీ వాడుకుంటుంద‌ని.. త‌ర్వాత ఆయ‌న‌ను బీజేపీ మోసం చేస్తుంద‌న్నారు. ఒక‌ప్పుడు నితీష్‌, లాలూ యాద‌వ్ క‌లిసి నాటి ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తే.. లాలూను జైలుకు పంపారు. ఈ విష‌యాన్ని నితీష్ గుర్తుంచుకోవాల‌న్నారు. ఇప్ప‌టికే బీజేపీ - ఆర్ఎస్ఎస్ భావ‌జాలాన్ని వీడి.. తేజ‌స్వికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నితీష్‌ను దిగ్విజ‌య్ సింగ్ కోరారు. బీహార్ రాజ‌కీయాల‌ను వ‌దిలి జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని నితీష్‌కు ఆయ‌న సూచించారు.