శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 25, 2020 , 15:23:59

శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ త్వరగా కోలుకోవాలి: మాజీ సీఎంలు

శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ త్వరగా కోలుకోవాలి: మాజీ సీఎంలు

భోపాల్‌: కరోనా బారినపడ్డ మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ త్వరగా కోలుకోవాలని అంతా ఆకాంక్షిస్తున్నారు. శివరాజ్‌సింగ్‌చౌహాన్‌‌ కరోనా నుంచి వేగంగా రికవరీ కావాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు దిగ్విజయ్‌సింగ్‌, కమల్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు. ‘ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ అనారోగ్యంతో ఉన్నారని తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిద్దాం.’ అని కమల్‌నాథ్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

 ‘శివరాజ్‌జీ మీకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దేవుడు మిమ్మల్ని త్వరగా కోలుకునేలా చూస్తాడు. సామాజిక దూరం పాటించండి. జాగ్రత్త వహించండి’ అని దిగ్విజయ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. కాగా, తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజస్‌సింగ్‌చౌహాన్‌ శనివారం స్వయంగా ప్రకటించారు. తనతో సన్నిహితంగా మెదిలినవారంతా తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo