శనివారం 11 జూలై 2020
National - Jun 18, 2020 , 08:24:33

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, స్మృతి ఇరానీలపై కేసు పెట్టండి

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, స్మృతి ఇరానీలపై కేసు పెట్టండి

భోపాల్‌: కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై నకిలీ వీడియోను ట్వీట్‌ చేసినందుకు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, దాన్ని రీ ట్వీట్‌ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల ప్రచారసభలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నకిలీ వీడియో ట్వీట్‌ చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, స్మృతి ఇరానీలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు.

కమల్‌నాథ్‌ నేతృత్వంలోని గత కాంగ్రెస్‌ ప్రభుత్వ మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ అప్పటి మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (ఈ ఏడాది జనవరి 12న) ప్రకటన విడుదల చేశారు. ఆ వీడియోను ఎడిట్‌ చేసి ప్రసారం చేసినందుకు దిగ్విజయ్‌ సింగ్‌తో సహా మరో 11 మందిపై పోలీసులు ఈ నెల 15న (సోమవారం) ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 


logo