గురువారం 09 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 01:06:57

కమల్‌నాథ్‌ సర్కార్‌ కూల్చివేతకు కుట్ర: దిగ్విజయ్‌ సింగ్‌

కమల్‌నాథ్‌ సర్కార్‌ కూల్చివేతకు కుట్ర: దిగ్విజయ్‌ సింగ్‌

న్యూఢిల్లీ/భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తున్నదని ఆ రాష్ట్ర మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. ‘సీఎం కావాలని శివరాజ్‌ సింగ్‌, డిప్యూటీ సీఎం కావాలని నరోత్తమ్‌ మిశ్రా కలలు కంటున్నారు. 15 ఏండ్లుగా రాష్ర్టాన్ని లూటీ చేసిన వారు.. ఇప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారు. ఒక్కొక్కరికి రూ.25-35 కోట్ల మేరకు ఇస్తామంటూ ప్రలోభ పెడుతున్నారు. తొలి విడుతగా రూ.5 కోట్లు, రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తర్వాత రెండో విడుత, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మిగతా మొత్తం చెల్లిస్తామని చెబుతున్నారు’ అని దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. అసెంబ్లీలో విపక్ష బీజేపీ నేత గోపాల్‌ భార్గవతోపాటు మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌  దీన్ని ఖండించారు. 
logo