గురువారం 02 జూలై 2020
National - Jun 15, 2020 , 15:53:53

మద్యం పోస్తున్న సీఎం వీడియోః డిగ్గీరాజాపై కేసు నమోదు

మద్యం పోస్తున్న సీఎం వీడియోః డిగ్గీరాజాపై కేసు నమోదు

భోపాల్: రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయం వేడెక్కింది. ఒకవైపు రాజస్థాన్ లో తమ  ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపిస్తూ క్యాంపు రాజకీయాలకు దిగింది కాంగ్రెస్ పార్టీ.  మరోవైపు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ అభ్యర్థిగా బరిలో నిలిచిన దిగ్విజయ్ సింగ్ పై బీజేపీ కన్నెర్ర చేసింది. తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి వీడియోను సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేశారని ఆయనపై కేసు నమోదు చేసింది. 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యం పోస్తున్నట్టుగా స్పురణకు తెచ్చేలా ఉన్న వీడియోను కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై అక్కడి బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదు మేరకు భోపాట్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డిగ్గీరాజాపై కేసు నమోదు చేసింది.  బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఆదివారం రాత్రి కేసు నమోదు చేసినట్లు క్రైం బ్రాంచ్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ నిశ్చల్ జరియా తెలిపారు.  ఈ వీడియోను ఆదివారం మధ్యాహ్నం 1.50 గంటలకు సోషల్ మీడియాలో పోస్ట్  చేశానని స్వయంగా డిగ్గీరాజానే ట్వీట్ చేయడం విశేషం.  ముఖ్యమంత్రి చౌహాన్ పరువు తీయడమే ఉద్దేశంగా ఈ వీడియో పోస్ట్ చేశారని బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 500, 501, 502, 465ప్రకారం కేసుల నమోదు చేశారు. దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను తిరిగి ట్విట్లర్లో పోస్ట్ చేసిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. సచ్చలీ రాజకీయాలకు చోటులేకుండా పోతోంది అని వాపోయారు.  ప్రజలకు మద్యం పంపిణీ చేస్తే తాగి పడి ఉంటారు అని కార్లో కూర్చుని మీడియాతో మాట్లాడుతున్నట్లుగా పాత వీడియోను మార్పింగ్ చేసి కొత్త వీడియో తయారుచేశాడు. తర్వాత ఈ వీడియోను సోషల్ మీడయా నుంచి దిగ్విజయ్ సింగ్ తొలగించారు.


logo