మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 14:29:04

స్టాక్ బ్రోకింగ్ సేవలు అందించనున్నపేటీఎం

 స్టాక్ బ్రోకింగ్ సేవలు అందించనున్నపేటీఎం

బెంగళూరు : ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజ సంస్థ పేటీఎం సరికొత్త సేవలను అందించడానికి సిద్ధమైంది. త్వరలో స్టాక్ బ్రోకింగ్ సేవలను  ప్రారంభించను న్నట్లు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ప్రకటించారు. ఇప్పటికే డిజిటల్ పేమెంట్లతో పాటు ఈ కామర్స్ రంగంలోనూ పేటీఎం సేవలను అందిస్తున్నది. పేటీఎం అనతి కాలంలోనే మార్కెట్ లో నూతన ఒరవడిని సృష్టించింది. ఇటీవల స్మాల్ పేమెంట్స్ బ్యాంకు సేవల్లోకి ప్రవేశించింది. వీటితో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే సేవలతో సహా ఇతర ఆర్థిక సేవలు అందించేందుకు సిద్దమవుతున్నది.

ఇప్పటివరకు పేటీఎం అన్ని రకాల సేవలు ఒకే గొడుగు కింద కు తీసుకువచ్చే యోచనలో ఉన్నది. గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ సందర్భంగా సికోయ కాపిటల్ ఇండియా ఎండి రాజన్ ఆనందన్ తో జరిగిన ఫైర్ సైడ్ చాట్ లో భాగంగా విజయ్ శేఖర్ శర్మ స్టాక్ బ్రోకింగ్  ఎంట్రీ గురించి వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలోనే పేటీఎం కు స్టాక్ బ్రోకింగ్ సేవలు అందించేందుకు గాను సెబీ నుంచి అనుమతి కూడా లభించింది. దీంతో కంపెనీకి సరికొత్త సేవలు అందించేందుకు మార్గం సుగమం అయింది. కాగా, పేటీఎం వెల్త్ అనే ఫీచర్ ద్వారా పేటీఎం స్టాక్ బ్రోకింగ్ సేవలు అందించనున్నది. వీటితో పాటు మరిన్ని సేవల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.  


logo