శుక్రవారం 22 జనవరి 2021
National - Aug 27, 2020 , 09:25:39

డిజిటల్‌ ఆరోగ్య పథకం.. సమాచార గోప్యతకు చర్యలు

డిజిటల్‌ ఆరోగ్య పథకం.. సమాచార గోప్యతకు చర్యలు

న్యూఢిల్లీ: జాతీయ డిజిటల్‌ ఆరోగ్య పథకం (ఎన్‌డీహెచ్‌ఎం)లో భాగంగా సేకరించనున్న పౌరుల కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని భద్రపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా సమాచార గోప్యతను పాటించేందుకు విధి విధానాలను సిద్ధం చేసింది. ఈ మేరకు ‘హెల్త్‌ డేటా మేనేజ్‌మెంట్‌ పాలసీ’ని తీసుకొచ్చింది. దీనిపై సెప్టెంబర్‌ 3లోపు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎన్‌డీహెచ్‌ఎంను ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo